SGSTV NEWS
CrimeTelangana

నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే



చూడటానికి అదొక రోడ్డు సైడ్ డాబా.. ఏముంటాయ్ తినడానికి పరోటాలు, బిర్యానీ అని అనుకోవచ్చు. కానీ పైన పటారం లోన లొటారం.. అసలు ఆ డాబా హోటల్‌లో ఏమున్నాయో తెలిస్తే మీకే మైండ్ బ్లాంక్ ఆవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూసేయండి.


శంషాబాద్ రాయికల్ టోల్ గేట్ వద్ద భారీ డ్రగ్స్ రవాణా గుట్టు రట్టు అయింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ 1/2 కిలో, గంజాయి, ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. షాద్‌నగర్‌లోని సంజు భాయ్ మార్వాడి డాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నిఘా సమాచారం ఆధారంగా గుర్తించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. డాబా వంట మనిషి డ్రగ్స్‌ను రాజస్థాన్ నుండి తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్క గ్రాము హెరాయిన్‌ను నగరంలో రూ. 15,000 ధరకు విక్రయిస్తున్నారు. డ్రగ్స్ రవాణా కోసం నిందితులు బస్సులను ఉపయోగిస్తున్నారు. నిందితులు వికాస్ షో, సంజు భాయ్ గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌లో డాబా యజమాని మరణం తర్వాత వికాస్ హోటల్ నిర్వహణను చేపట్టి.. డ్రగ్ దందా నిర్వహిస్తున్నాడు.

డ్రగ్స్ కొనుగోలు చేసిన కన్స్యూమర్ వివరాలను సేకరిస్తున్నారు. డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడితో డ్రగ్స్ రవాణా చేసే ప్రధాన మార్గాలను గుర్తించి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టామని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ ఘటన డ్రగ్స్ విక్రయ వ్యవస్థపై మరింత లోతుగా దర్యాప్తు జరపవలసిన అవసరాన్ని చూపిస్తోంది.

Also read



Related posts

Share this