మేడిపల్లి: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేసి, ఆపై రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకొని మోసం చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్ ఉదయ్ నగర్కు చెందిన ఒక మహి భర్తతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా నివసిస్తోంది.
2019లో ఫేస్బుక్ ద్వారా అస్సాంలో విధులు నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ హుస్సేన్ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతనితో కలిసి బోడుప్పల్లో సహజీవనం చేసింది. అయితే, గత ఏడాది కాలంగా మహబూబ్ హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలు గుర్తించింది.
ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి పేరుతో తన వద్ద నుండి రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ న్యాయవాది కూడా తనకు పలుమార్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





