హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్
కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్‌కు చెందిన రవికుమార్ (35) అదే ప్రాంతంలోని టెంట్‌హౌస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం టెంటాస్ సమీపంలో అపార్ట్మెంట్ వద్ద ఆడుకుంటున్న బాలిక (4)కు చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా రవికుమార్ తీసుకెళ్లిన విషయం చెప్పింది. ఈ ఘటన పై సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





