SGSTV NEWS
CrimeTelangana

తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!

డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే జైలుకి పంపిస్తారనీ తెలుసు. అయినా కొందరు వాహనదారులు మారడం లేదు. ఫుల్లుగా మందు కొట్టి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు. కాగా, పబ్లిక్‌కు ఆదర్శంగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. నేనూ కానిస్టేబుల్‌నే నన్నెవడురా ఆపేదీ అనుకున్నాడో ఏమో కానీ, వాళ్లు కూడా పూటుగా తాగి రోడ్డెక్కి నానా రభస చేశాడు. అంతేకాదు మద్యం మత్తులో నడిరోడ్డుపై ఆపినందుకు పోలీసులనే చితకబాదాడు.

హైదరాబాద్‌ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పూటుగా తాగిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రయ్ మంటూ దూసుకువచ్చాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా.. కానిస్టేబుల్ వాహనంతో పలు వాహనాలను ఢీకొట్టాడు. అతన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ చేసేందుకు ప్రయత్నించారు. అందుకు అతని నిరాకరించాడు. పైగా నన్నే ఆపుతారా అంటూ రుసరుసలాడాడు. ఏకంగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నాయక్‌పై దాడికి తెగబడ్డాడు. అక్కడున్న వారంతా వారిస్తున్నప్పటికీ మద్యం మత్తులో మరింత రెచ్చిపోయాడు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి అంటూ పోలీసుల మీదమీదకు వెళ్లాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.


కాగా, అతగాడు తతంగం అంతా అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో నడిరోడ్డుపై పోలీసులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Also read

Related posts

Share this