అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించాడు. శ్రీ మహా విష్ణువు అధినేత. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం ప్రజలు చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడుతాయో తెలుపుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత ఆత్మ యమరాజు ఆస్థానానికి చేరుకుంటుంది. అక్కడ చేసే ప్రతి పాప కార్యానికి శిక్ష విధిస్తారు. తమ జీవితాన్ని అబద్ధాలు చెబుతూ గడిపేసిన వారికి ఈ నరకంలో శిక్షించబడతారు.
గరుడ పురాణం హిందూ మత గ్రంథంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీ మహా విష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం … జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసే మంచి లేదా చెడు పనులు అన్నీ లెక్కించబడతాయి. మరణం తర్వాత వాటి ఫలాలను ఖచ్చితంగా పొందుతారు. ఇదే విషయాన్ని గరుడ పురాణం వెల్లడిస్తోంది. ఇందులో జననం నుంచి మరణం, స్వర్గం, నరకం, యమలోకం, పునర్జన్మ, అధోగతి మొదలైనవన్నీ వివరంగా వివరించబడ్డాయి.
గరుడ పురాణంలో చెప్పబడినది ఏమిటంటే.. మరణం తరువాత, చెడు పనులు చేసేవారి ఆత్మలు నేరుగా నరకానికి వెళతాయి. ఇక్కడ వారికి నేరాలకు తగిన శిక్షలు విధిస్తారు. ఎలాంటి శిక్షలను విధిస్తారనేది తెలిస్తే ఆత్మ వణికిపోతుంది. గరుడ పురాణం ప్రధానంగా 16 నరకాలను వివరిస్తుంది. ఈ 16 నరకాలలో.. పాపాల ప్రకారం శిక్షను పొందుతారు. ఎవరైనా చనిపోయినప్పుడు.. యమదూతలు అతని ఆత్మను యమ ధర్మ రాజు ఆస్థానానికి తీసుకువెళతారని.. అక్కడ త్రగుప్తుడు అతని కర్మ గురించి తెలియజేస్తాడని గరుడ పురాణం చెబుతుంది. దీని తరువాత అతని చర్యలను బట్టి అతనికి ఏమి శిక్ష విధించాలనేది నిర్ణయించబడుతుంది. కనుక జీవితంలో మంచి పనులు చేయడంతో పాటు, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. ఎవరికీ హాని చేయకూడదు.
అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయి.
అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్షలు విధించే నిబంధన ఉంది. ఎవరైనా సరే అబద్ధాలు చెప్పి చాలాసార్లు తప్పించుకుని ఉండవచ్చు.. అయితే ఇలా అబద్ధాలు చెప్పి శిక్ష నుంచి ఎవరూ శాశ్వతంగా తప్పించుకుంటారని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే మరణించిన తర్వత మీ ఆత్మ మీరు చెప్పే అబద్ధాలకు యమ ధర్మ రాజు ఆస్థానంలో జవాబు చెప్పాల్సి ఉంటుంది.
అబద్ధాలు చెప్పే వాళ్ళు ఏ నరకానికి వెళ్తారంటే
యమ ధర్మ రాజు ఆస్థానంలో అబద్ధాలు చెప్పే వారి ఆత్మలను వదిలిపెట్టరు. చెప్పిన అందాలకు శిక్షించబడతారు. అబద్ధాలు చెప్పే వారిని తప్త కుంభ నరకానికి పంపిస్తారు. ఈ నరకంలో చుట్టూ అగ్ని మండుతుందని.. వేడి నూనె.. ఇనుప పొడి ఉండి కణకణమండే కుండలు ఉంటాయని చెబుతారు. యమ దూతలు అబద్ధాలు చెప్పే పాపాత్ముల ముఖాన్ని ఈ వేడి కుండలోకి పెడతారు. మండే అగ్ని లోకి పడేస్తారు
