SGSTV NEWS
Andhra PradeshCrime

Petrol Pump Abuse:ఉద్యోగిని అర్ధనగ్నంగా సంకెళ్లతో స్తంభానికి కట్టేసి..
పెట్రోల్ పంప్ మేనేజర్ దాష్టీకం



Petrol Pump Abuse| ఒక పెట్రోల్ పంప్లో పనిచేసే ఉద్యోగి పట్ల ఆ పంప్ మేనేజర్ అమానుషంగా ప్రవర్తించాడు. అతడి బట్టలు విప్పదీసి, కాళ్లు చేతులు సంకెళ్లతో కట్టేసి మనుషులతో కొట్టించాడు. డబ్బులు తక్కువగా ఇచ్చాడని కారణం చూపుతూ తన చర్యలను సమర్థించుకున్నాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగింది. అక్కడ ఓ పెట్రోల్ బంక్లో పంప్ బాయ్ గా పనిచేసే యువకుడిని నిర్వాహకులు దారుణంగా చితకబాదారు. నల్లచెరువు మండలానికి చెందిన బాబాఫకృద్దీన్ కొన్ని రోజుల క్రితం ఈ బంక్లో పని ప్రారంభించాడు. ఈ పెట్రోల్ బంక్ను వైసీపీ నాయకుడు బత్తల హరిప్రసాద్ కుటుంబం నిర్వహిస్తోంది.

శనివారం ఉదయం ఫకృద్దీన్ డ్యూటీ ముగించి నగదు అప్పగించాడు. అయితే, పెట్రోల్ విక్రయాల కలెక్షన్ లో రూ.24 వేలు తక్కువ ఉన్నాయని మేనేజర్ సత్యనారాయణ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు దొంగతనం చేసి ఉంటాడని ఆరోపిస్తూ కొట్టాడు. ఆ తరువాత ఇతర ఉద్యోగులు అమర్నాథ్, మాబు, హరికృష్ణ కూడా అతడిని కొట్టారు. ఫకృద్దీన్ బట్టలు విప్పేసి, స్తంభానికి చైన్లతో కట్టేశారు. చేతులు, కాళ్లను అసలు కదలడానికి వీల్లేకుండా కట్టేశారు. సుమారు 2-3 గంటలపాటు అతడిని బహిరంగంగా హింసించారు. ఈ విషయం తెలిసి ఫకృద్దీన్ బంధువులు అక్కడికి చేరుకొని నిలదీసినా నిర్వాహకులు వినలేదు. ఆ తరువాత బాధితుడిని ఓ గదిలో పడేశారు.

విషయం తెలిసిన సీఐ నిరంజన్రెడ్డి పెట్రోల్ బంక్కు వెళ్లి విచారణ చేశారు. ఫకృద్దీన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మేనేజర్, ఇతర ఉద్యోగులను కూడా స్టేషన్కు పిలిచారు. వారు తమ యజమాని ఆదేశాల మేరకే ఇలా చేశామని చెప్పారు.

నగదు విషయంలో దొంగతనం జరిగినట్లు తేలితే చట్ట రీత్యా నిందితుడిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా అమానుషంగా కాళ్లు, చేతులు కట్టేసి కొట్టడం నేరమని పోలీసులు తెలిపారు.

అందుకే ఈ ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణలను నిందితులుగా చేర్చారు. అయితే, బంక్ నిర్వహిస్తున్న బత్తల హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అందుకే ఈ ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణలను నిందితులుగా చేర్చారు. అయితే, బంక్ నిర్వహిస్తున్న బత్తల హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also read

Related posts

Share this