ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కావమ్మ తల్లి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. తిరునాళ్లు 2వరోజు శనివారం రాత్రి అమ్మవారిని పురవీధుల్లో ఉరేగిస్తున్నారు. ఉత్సవ నిర్వాహకుడు కావమ్మ తల్లికి దిష్టి తీస్తూ తాండవం చేశాడు. తర్వాత అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం బెస్తపాలెం వీధిలో శ్రీ కావమ్మ తల్లి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. తిరునాళ్లు రెండవరోజులో భాగంగా శనివారం రాత్రి అమ్మవారిని పురవీధుల్లో ఉరేగిస్తున్నారు. ఈ సందర్భంగా పూజరి కావమ్మ తల్లికి దిష్టి తీశాడు. ఉత్సవ నిర్వాహకుడు గుర్రం శోభన్ బాబు హఠాత్మరణం చెందారు. గుమ్మడికాయ దిష్టి తీస్తూ తాండవం చేశారు. అనంతరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శోభన్ బాబు అమ్మవారి ఊరేగింపు వాహనం ముందు తాండవం చేస్తూ అందరూ చూస్తుండగానే నేలకొరిగాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో నిర్వాహకుడు దిష్టి తీస్తూ తాండవం చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. స్థానికులు వెళ్లి చూసేసరికి స్పృహ కోల్పోయాడు. భక్తులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శోభన్ బాబు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్సవ నిర్వహకుడు మృతితో తిరునాళ్లు ఆగిపోయాయి. అప్పటి వరకూ పండుగ వాతావరణం ఉన్న ఊరిలో ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. భక్తులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమైయ్యారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





