అనంతపురం జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో దారుణం.. ఎల్లమ్మకాలనీలో మరో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ గంగ గొంతుకోసి హత్య చేశాడు భర్త వీరాంజనేయులు. ఆ తర్వాత.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బిందెల కాలనీకి చెందిన లక్ష్మీగంగ (27), పామిడి మండల కేంద్రానికి చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎల్లమ్మ కాలనీలో నివాసముంటున్న వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లపాటు కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి.
భార్య లక్ష్మీ గంగపై అనుమానంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం (జనవరి 22) తెల్లవారుజామున కూడా భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలోనే ఆవేశంతో గొంతు కోసి చంపేశాడు. నేరుగా స్టేషన్‌కు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోయాడు. వీరాంజనేయులు, లక్ష్మీ గంగ ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను తానే హత్య చేశానని వీరాంజనేయులు అంగీకరించాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





