మెదక్ జిల్లాలో పోలీసుల సమక్షంలోనే ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, యువతి బంధువులు జాతీయ రహదారిపై పోలీసు వాహనాన్ని అడ్డుకుని యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు.
మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతరం జంటను సఖి కేంద్రానికి తరలిస్తుండగా, జాతీయ రహదారిపై యువతి బంధువులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల ముందే సాయినాథ్‌పై దాడి చేయడమే కాకుండా, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు.
సాయినాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే స్పందించారు. యువతిని గుర్తించి రక్షించి సఖి కేంద్రానికి తరలించారు. యువకుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





