SGSTV NEWS
CrimeTelangana

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం



అడ్డుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

వివరాల్లోకి వెళ్తే, పిచ్చిరామ్ తండాకు చెందిన నూనావత్ వినోద కుటుంబ తగాదాలో తనకు న్యాయం జరగడం లేదంటూ స్టేషన్ గేటు ఎదుట మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

తన భర్త నరేందర్ విడాకుల విషయంలో పరిహారం ఇవ్వడాన్ని తిరస్కరించగా, వినోద న్యాయం కోసం శుక్రవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డా.రాంచంద్రు నాయక్  కు మొరపెట్టుకుంది

ఎమ్మెల్యే సూచనతో పోలీసులు శనివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే సమస్య పరిష్కారమవకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది

గమనించిన ఆమెను అడ్డుకొని,హుటాహుటిన 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Also read

Related posts

Share this