హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం
100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొట్టేసిన మాయలాడి
జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న మోసగత్తె
కరీంనగర్లో మాయలేడిని అరెస్ట్ చేసిన మధురానగర్ పోలీసులు
అంబర్ పేటకు చెందిన బితుకు ప్రసన్న రెడ్డి( 45 ) బడాయి మాటలు చెప్పుకుని మోసాలు చేయడంలో ఆరితేరింది. వెంగళరావునగర్లో ఉండే ఎస్. జీవన్ (35) మూడేళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బి.ప్రసన్నరెడ్డి పరిచయమైంది
తాను హైకోర్ట్ అడ్వకేట్ నంటూ గొప్పలు చెప్పుకునేది.. పరిచయమైన రెండు, మూడు నెలల తర్వాత వారిని మాయమాటలతో గాలం వేసి మోసం చేస్తుంది.
ఎన్నాళ్ళిలా కష్టాలు పడ్తారు.. హైకోర్ట్ న్యాయవాదైన తనకు చాలా మంది జడ్జీలతో పరిచయాలు ఉన్నాయని.. రూ.15 లక్షలు ఇస్తే హైకోర్టులో రికార్డ్ పోస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని జీవన్ ను నమ్మించింది
ఆమె మాటలు నమ్మి రూ.6.5 లక్షలు ఇచ్చాడు. ఉద్యోగం కోసం అడిగితే ఫైల్ ప్రాసెస్లో ఉందని నమ్మించేది.
అనుమానం రాకుండా ఉండేందుకు హైకోర్ట్ హాల్లో తాను నల్ల కోటు ధరించి ఉన్న వీడియోలు, ఫోటోల్ని తీసి పంపేది
మిగతా రూ.8.5 లక్షలు కూడా వసూలు చేసేందుకు శైలజారెడ్డి అనే మహిళని హైకోర్ట్ న్యాయమూర్తిగా పరిచయం చేసింది. ఆమె అసిస్టెంట్ ఫిరోజ్ ఖాన్ అని చెప్పి వారిద్దర్నీ పరిచయం చేసింది
ఆరు నెలలు గడిచినా ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రసన్న రెడ్డి చేతుల్లో మోసపోయానని.. ఉద్యోగం కోసం ఆ మాయలేడికి రూ.4.5 లక్షలు ముట్టజెప్పానని చెప్పాడు.ఈ క్రమంలో ప్రసన్న రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది
అంబర్ పేటలోని ఆమె ఇంటికి వెళ్లగా తాళాలు వేసి ఉండటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న