కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిని అనుమానంతో ఉరేసి చంపాడు. అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ కృష్ణారెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
AP Crime: కడప జిల్లా చెన్నూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానమే ఇద్దరి జీవితాలను బలితీసుకుంది. చెన్నూరుకు చెందిన నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిని అనుమానంతో ఉరేసి చంపాడు. అనంతరం తానే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన ఒక్కసారిగా ప్రాంతంలో విషాదాన్ని నింపింది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఆందుకు కారణం నిత్యానంద్‌కు కలిగిన అనుమానమేనని స్థానికులు చెబుతున్నారు.
ప్రాణాలు తీసిన అనుమానం..
నిత్యానంద్ గత కొంతకాలంగా కువైట్‌లో పనిచేస్తున్నాడు. 11 రోజుల క్రితమే స్వగ్రామమైన చెన్నూరుకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో భార్యపై అతనికి తీవ్ర అనుమానం పెరిగిందని.. అప్పటి నుంచే ఇంట్లో వాదనలు, వాగ్వాదాలు పెరిగాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. అనుమానం హద్దులు దాటడంతో బుధవారం రాత్రి ఈ దారుణానికి తెగబడ్డాడు. మొదట భార్య లక్ష్మీ కుమారిని ఉరేసి హత్య చేసి.. వెంటనే తానే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో వారి ఇద్దరు కుమార్తెలు మేఘన, మౌనిక చిన్న వయస్సులోనే అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబం మధ్య ఇలా విషాదాంతం జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పక్కింటి వారు తెల్లవారుజామున మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న చెన్నూరు పోలీస్ స్టేషన్ సీఐ కృష్ణారెడ్డి వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందటంలో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. వారిని చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. వారి భవిష్యత్తు ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు