క్షణికావేశం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అప్పటివరకు మాట్లాడుతూ కనిపించిన వ్యక్తులు రెప్పపాటులో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డులో జరిగిన ఓ విషాద ఘటన షాకింగ్‌కు గురి చేసింది. అందరు చూస్తుండగానే ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ నిండు ప్రాణం గాలిలో కలిసింది.
రాంనగర్ చౌరస్తా సమీపంలోని అపార్ట్మెంట్ పైనుంచి దూకిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని గిరి శిఖర అపార్ట్మెంట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అపార్టమెంట్ లోపలికి వెళ్లిన సనా బేగం (23) అనే యువతి నేరుగా 5వ అంతస్తు టెర్రస్ పైకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె కిందకి దూకేసింది. సనా బేగం అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సనా బేగం ఎందుకు మృతి చెందింది..? ఆమె ఆత్మహత్యకు గల కారణాలను చిక్కడపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. సనా బేగం మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- శ్రీ కూర్మ జయంతి
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు





