SGSTV NEWS
CrimeTelangana

Occult Worship: మహబూబ్‌నగర్‌లో క్షుద్ర పూజల కలకలం.. మూఢనమ్మకాల మాయలో మరుగున పడిన మానవత్వం


మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లిలో రహస్యంగా నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపింది. పవన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు గణేష్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతను ఆరోగ్యం మెరుగవుతుందని పెంటోజితోపాటు మరో వ్యక్తి సహాయంతో ఈ పూజలను నిర్వహించాడు.

Occult Worship: మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామ శివారులో ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ శివారులో రహస్యంగా నిర్వహించిన క్షుద్ర పూజల వ్యవహారం వెలుగులోకి రావడంతో అందరినీ ఆందోళనలోకి నెట్టింది. పవన్ కుమార్ అనే వ్యక్తి తన కుమారుడు గణేష్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో.. ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకంతో మూఢనమ్మకాల ఒడిలో పడ్డాడు. శాస్త్రీయ వైద్యం కంటే క్షుద్ర తంత్రాలే మార్గమని భ్రమకు లోనైన పవన్.. ఎదిరెకు చెందిన పెంటోజితోపాటు మరో వ్యక్తి సహాయంతో ఈ పూజలను నిర్వహించాడు

బలి ఇస్తూ పూజారి పూజ..
క్షుద్ర పూజ కోసం నిమ్మకాయలు, జీడి గింజలు, పసుపు, కుంకుమ వంటి పదార్థాలతో పూజా సామాగ్రిని సిద్ధం చేశారు. వీటితోపాటు నాటుకోడిని బలి ఇస్తూ పూజారి తంత్రిక పద్ధతుల్లో పూజ నిర్వహించాడు. ఈ అమానవీయ చర్యలన్నీ గ్రామ శివారులో రహస్యంగా జరిగాయి. అయితే ఈ వివరాలు ఎలాగో బయటకు వచ్చాయి. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పూజలను అడ్డుకున్నారు. అక్కడున్న ముగ్గురు పవన్ కుమార్, పెంటోజి, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఆరోగ్యానికి సరైన వైద్యం అందించాల్సిన సమయంలో ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం అత్యంత బాధాకరం. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగే విధంగా ఉన్నాయంటే అది నిరాశాజనకమే. ఈ సంఘటన మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. గ్రామస్థుల స్పందన చూస్తే వారు కూడా ఈ తరహా కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది



Also read

Related posts

Share this