మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు
Manchu Family Fight: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మంచు బ్రదర్స్ విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ అన్న విష్ణు పై దొంగతనం కేసు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. విష్ణు అనుచరులు తన కారుతో కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన నివాసంలో 150 మందితో విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు.
ముదురుతున్న వివాదం
ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ లో మొదలైన మంచు ఫ్యామిలీ వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ఆస్తుల విషయంలో మనోజ్, విష్ణు వివాదం మొదలైంది. నాలుగు గోడల మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో మనోజ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతానికి జల్ పల్లి ఆస్తుల వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Also read
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.
- చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!
- స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు
- కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి





