SGSTV NEWS
CrimeNational

మరో హనీమూన్‌ మర్డర్.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో డెడ్ బాడీ! సర్‌ఫ్రైజ్‌ అని ఇంటికి పిలిచీ..

రాజా రఘువంశీ ‘హనీమూన్‌ మర్డర్’ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు..




అగర్తల, జూన్‌ 12: మేఘాలయ హనీమూన్‌ మర్డర్ దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచ్చెరాలోని ఒక దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్‌లో ఓ ట్రాలీ బ్యాగ్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితులు డాక్టర్ దిబాకర్ సాహా (28), అతని తండ్రి దీపక్ (52), తల్లి దేబికా (40), నబానితా దాస్ (25), జోయ్‌దీప్ దాస్ (20), అనిమేష్ యాదవ్ (21)గా పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే..

అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అగర్తలకు చెందిన షరిఫుల్ ఇస్లాం (20) అనే యువకుడు జూన్‌ 8న అదృశ్యమయ్యాడు. దీంతో జూన్‌ 9న క్యాపిటల్ కాంప్లెక్స్ (ఎన్‌సిసి) పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ, షరిపుల్ మధ్య నడిచిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ కుమార్ తెలిపారు. షరిపుల్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సమీప బంధువైన దిబాకర్ సాహా కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. వీరిరువురి మధ్య నడచిన ఫోన్‌ సంభాషణలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దిబాకర్‌ ప్రియురాలిని దక్కించుకోవడానికి షరిపుల్‌ అడ్డు తొలగించాలని భావించాడు. ఇందుకోసం పక్కా స్కెచ్‌ వేశాడు.


ఇంద్రానగర్‌లోని జోయ్‌దీప్ ఇంట్లో కలుద్దామని షరిపుల్‌కు ఫోన్‌ చేశాడు. ఇంటికి వచ్చిన అతడిని సాహా జోయ్‌దీప్, నబనిత, అనిమేష్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత అతడి చేతులు కట్టి, మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి దిబాకర్, అతని తల్లిదండ్రులు కలిసి గండచెర్రకు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఆ సూట్‌కేస్‌ను అతని తండ్రి దుకాణంలోని ఐస్‌ క్రీం ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దిబాకర్‌ తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి షిరిఫుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురు మధ్య నడచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు మొబైల్ సందేశాల ద్వారా పోలీసులు గుర్తించారు

Also read

Related posts

Share this