SGSTV NEWS online
Andhra PradeshCrime

రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర




తిరుపతి : బాధితుడికి ఇవ్వాల్సిన రికవరీ నగదు కాజేసిన న్యాయవాదిని నిలదీసిన పోలీస్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర జరిగింది. కొందరు నేరస్థులను హత్యకు ప్రేరేపించిన న్యాయవాది విషయం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామ్ కిషోర్ వివరాల మేరకు.. పాత కేసులో పరారీలో ఉన్న నిందితుడు నాగరాజు ఆచూకీ కోసం అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్.. అదే కేసులో బెయిల్పై బయట ఉన్న నిందితుడు చందును విచారించారు. ఆ సమయంలో న్యాయవాది గుణశేఖర్ గురించి చందు కొన్ని విషయాలు బయట పెట్టారు. ‘నిన్ను అరెస్టు చేసిన అలిపిరి కానిస్టేబుల్ ప్రకాష్ను హత్య చేస్తే ఆ కేసుకు సంబంధించిన ఉచితంగా న్యాయ సహాయం చేస్తా.. ఒక వేళ నువ్వు చేయకపోతే నాకు తెలిసిన మరికొందరితో కానిస్టేబులు హాని కలిగిస్తా’ అని న్యాయవాది తనతో చెప్పినట్లు నిందితుడు చందు. ఎస్ఐకు వివరించారు. ప్రాథమిక దర్యాప్తులో అతను చెబుతున్నది వాస్తవమని తేలడంతో న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.

ప్రశ్నించడంతో.. న్యాయవాది గుణశేఖర్, కానిస్టేబుల్ ప్రకాష్ ఇద్దరూ యోగి మల్లవరం ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ పరిచయం మేరకు న్యాయవాది గుణశేఖర్ కేసులు రెఫర్ చేయాలని కానిస్టేబుల్ను కోరారు. అలిపిరి పీఎస్లో రికవరీ చేసిన నగదును కోర్టులో ప్రవేశపెట్టి బాధితుడికి ఇచ్చే కేసును అప్పగించారు. రివకరీ సొమ్ము రూ.50 వేలను బాధితుడికి ఇవ్వకుండా న్యాయవాది గుణశేఖర్ సొంత అవసరాలకు వాడుకున్నారు. కొన్నాళ్లకు బాధితుడు కానిస్టేబుల్ ప్రకాష్ను కలిసి రికవరీ నగదు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై న్యాయవాది గుణశేఖర్ ఇంటికెళ్లి కానిస్టేబుల్ ప్రకాష్, నిలదీయడంతో దశల వారీగా నగదు తిరిగిచ్చారు. ఈ క్రమంలో తన ఇంటికొచ్చి పరువు తీశాడని వ్యక్తిగత కక్ష పెంచుకున్న న్యాయవాది.. కానిస్టేబుల్ హత్యకు కుట్ర చేసినట్లు గుర్తించారు.

Also read

Related posts