తులసి మొక్కకు సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ తులసి మొక్కను ప్రధానంగా హిందూ కుటుంబాలలో పూజిస్తారు. కొన్ని ప్రత్యేక రోజులలో తప్ప ప్రతిరోజూ తులసికి నీటిని కూడా సమర్పిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఇలా చేసిన వ్యక్తిపై శ్రీ విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. అయితే తులసి పూజ సమయంలో ఏ వస్తువులను సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..
తులసి లక్ష్మీ దేవికి సంబంధించినదని నమ్ముతారు. తులసిని విష్ణువుకు కూడా ప్రియమైనదిగా భావిస్తారు. తులసిని ప్రతిరోజూ సరైన పద్ధతిలో పూజించే ఇంట్లో ఆనందం, అదృష్టానికి కొరత ఉండదని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో కూడిన తులసి ఆశీర్వాదాలను పొందడానికి నీటితో పాటు తులసి మొక్కకు మీరు ఏమి అందించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.. ఇలా తులసి అనుగ్రహం కోసం వీటిని సమర్పించడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
👉 తులసికి నీటితో పాటు తులసికి పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. గురువారం , శుక్రవారం తులసికి పచ్చి పాలను సమర్పించడం ద్వారా మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో తులసి ఆశీర్వాదంతో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం.
👉 నీటితో పాటు.. తులసికి చెరకు రసం నైవేద్యం పెట్టడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి నెల పంచమి తిథి రోజున తులసికి చెరకు రసం నైవేద్యం పెట్టడం మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది సాధకుల కష్టాలన్నింటినీ తొలగిస్తుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
👉 పూజ సమయంలో మీరు తులసి మాతకు కొన్ని వస్తువులను కూడా సమర్పించవచ్చు .. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి. దీని కోసం, మీరు తులసికి ఎరుపు రంగు చునారి, అలంకరణ వస్తువులను కూడా సమర్పించవచ్చు. దీని ద్వారా లక్ష్మీదేవి మీకు సిరి సంపదలను శ్రేయస్సును ప్రసాదిస్తుంది.
👉 అయితే ఇలా తులసి మొక్కకు నీటిని సమర్పించడానికి నియమాలున్నాయి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా కర్మ చేసిన తర్వాత తులసికి నీటిని సమర్పించాలి. నీటిని సమర్పించడానికి రాగి లేదా ఇత్తడి కుండను ఉపయోగించడం మరింత పవిత్రంగా పరిగణించబడుతుంది.
👉 ఆదివారం, ఏకాదశి నాడు తులసికి నీటిని సమర్పించకూడదని నమ్మకం. కనుక ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అంతేకాదు తులసి అనుగ్రహం కలగాలంటే.. పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను తులసికి సమర్పించవద్దు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగ వచ్చు. ఇంట్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
