గరుడ పురాణం అనేది మరణం తర్వాత జీవి చేరుకునే ప్రపంచాన్ని, చనిపోయిన ఆత్మతో జరిగే కార్యకలాపాలను వివరించే పురాణం. గరుడ పురాణం ప్రతి పాపానికి వేర్వేరు నరకాలను వివరిస్తుంది. అటువంటి పరిస్థితిలో గరుడ పురాణంలో ఒకరిని చంపిన వారికి .. లేదా హత్య చేయించిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
గరుడ పురాణం ప్రతి పాపానికి భిన్నమైన నరకాన్ని వివరిస్తుంది. అందులో హింసలు, శిక్షలు, వివిధ రకాల నరకాల గురించి వివరించబడింది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన కర్మల ఆధారంగా స్వర్గంలో లేదా నరకంలో చోటు పొందుతాడు. చెడు పనులు చేసేవారు నరకంలోని రకరకాల హింసలను అనుభవించాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో మొత్తం 36 నరకాలు వివరించబడ్డాయి. వీటిలో ప్రతిదానిలోనూ వివిధ రకాల శిక్షలు విధించబడతాయి. ఒక అమాయకుడిని చంపినందుకు గరుడ పురాణంలో ఎటువంటి శిక్ష విధించబడుతుందో తెలుసుకుందాం.
హత్య చేసినందుకు శిక్ష ఏమిటంటే
గరుడ పురాణంలో అమాయక జీవులను చంపడం లేదా చంపించడం అతి పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. దీనికి కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఎవరినైనా చంపిన వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మకి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఘోరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం అమాయక వ్యక్తిని చంపినట్లయితే.. అతని ఆత్మ అనేక రకాల నరకాలకు పంపబడుతుంది.
కొన్ని ప్రధాన నరకాలు: రౌరవ, కుంభీపాక, తాళ, అవిచి.. వంటి 16 భయంకరమైన నరకాలను, ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం ఒక బ్రాహ్మణుడిని చంపిన తర్వాత ఆత్మను కుంభీపాక నరకంలో పడవేస్తారు. అక్కడ ఆత్మని నిప్పుతో మండుతున్న ఇసుకలో పడవేస్తారు. మరోవైపు క్షత్రియుడిని లేదా వైశ్యుడిని చంపిన తర్వాత, ఆత్మను తాల నరకానికి పంపుతారు.
1 కుంభీపాకం: గరుడ పురాణం ప్రకారం ఈ నరకంలో ఆత్మ వేడి నూనెలో ఉడికిపోతుంది. ఈ నరకం ఎవరి ఆస్తినైనా ఆక్రమించిన లేదా బ్రాహ్మణుడిని చంపిన వారికి.
2 రౌరవ: గరుడ పురాణం ప్రకారం ఈ నరకంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు ఆత్మ రెల్లులా నలిగిపోతుంది.
3 తాల: గరుడ పురాణం ప్రకారం క్షత్రియులను, వైశ్యులను చంపే వ్యక్తులను ఈ నరకంలో పడవేస్తారు.
4 అవిచి: ఈ నరకాన్ని అత్యంత కఠినమైనదిగా భావిస్తారు. అబద్ధం చెప్పే, అబద్ధ ప్రమాణం చేసి.. అబద్ధ సాక్ష్యం చెప్పే వ్యక్తులను ఇక్కడికి పంపుతారు.
5 అంధతమిస్త్ర నరకం: ఎదుటి వారిని కేవలం తమ స్వలాభం కోసం ఒక వస్తువులా వాడుకుని మోసగించే స్త్రీ లేదా పురుషులకు, ఈ లోకంలో శిక్ష విధింపబడుతుంది.
6 శాల్మలీ నరకం: అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ, ఈ నరకంలో మండుతున్న ముళ్లను కౌగిలించుకోవలసి వస్తుంది.
7 గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత ఆత్మ యమరాజు ఆస్థానానికి వెళుతుంది. ఆ సభలో ప్రతి పాపానికి శిక్ష విధించే నిబంధన ఉంటుంది. ప్రతి ఆత్మ దాని కర్మల ప్రకారం శిక్షను పొందుతుంది.
