బాపట్లలో శిఖరం వారి వీధిలో నివసిస్తున్న అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం అనారోగ్యం, ఒంటరితనం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పురుగుమందు కలిపిన ఆహారం తీసుకోవడంతో.. వీరితో పాటు వారి కుక్కలు కూడా మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా విషాదకర చర్చనీయాంశంగా మారింది.
అది బాపట్లలోని శిఖరం వారి వీధి. ఎంతో కాలంగా అక్కడ ఇద్దరు అవివాహితులైన అన్నదమ్ములు నివసిస్తున్నారు. ఒకరు పంటి వైద్యుడు కాగా… ఇద్దరికి అరవై ఏళ్ల పైనే వయస్సు ఉంటుంది. అయితే వీరి నివసిస్తున్న ఇంటి నుంచి దుర్గధం వస్తుండటంతో స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి లోపలకి వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. అన్నదమ్ములిద్దరూ చనిపోయి ఉన్నారు. వీరితో పాటు ఉండే రెండు కుక్కలు కూడా చచ్చి పడి ఉన్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శిఖరం వారి వీధిలో అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం నివసిస్తున్నారు. వీరికి వివాహం కాలేదు. ఇద్దరికి వయస్సు అరవై ఏళ్లే పైనే ఉంటుంది. దీంతో తరుచు అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరి బంధువులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. సుబ్రమణ్యం పంటి వైద్యులుగా సేవలందిస్తున్నారు. అయితే అనారోగ్యం, వృద్ధాప్యం, ఒంటరితనం వేధిస్తుండటంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారు తినే ఆహారంలో పురుగు మందు కలుపుకొని ఉంటారన్న అనుకుంటున్నారు. వీరితో పాటు అదే ఆహారాన్ని తిన్న కుక్కలు కూడా చనిపోయాయి. దీంతో ఆత్మహత్యే అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటారని.. వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
- వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..