ప్రేమ విఫలమైందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని మద్యం సేవించి మత్తులో వీరంగం సృష్టించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఆమెను స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో కూడా మత్తు వీరంగం సృష్టించిన విద్యార్థిని చివరకు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక విద్యార్థిని తాను లవ్‌లో ఫెయిల్ అయ్యానంటూ మద్యం సేవించి మత్తులో హంగామా చేయడం స్థానికంగా కలకలం రేపింది. స్వగ్రామం నుంచి గుడ్లవల్లేరు బస్సులో రోజూ కాలేజీకి వెళ్తున్న విద్యార్థిని..నాలుగు రోజుల క్రితం మచిలీపట్నం-చిలకలపూడి బీచ్‌లో నిర్వహించిన ఫెస్టివల్‌కు హాజరయింది. అక్కడ తనకు గుడివాడ మండలానికి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. గురువారం సాయంత్రం కాలేజ్ ముగిసిన తరువాత.. ఆమె ఆ యువకుడికి ఫోన్ చేసి తాను ప్రేమలో విఫలమయ్యానని.. బాధతో మద్యం తాగాలని ఉందని చెప్పింది. ఆ యువకుడు మద్యం బాటిల్ తీసుకురాగా.. ఇద్దరూ గుడ్లవల్లేరు-గుడివాడ మార్గంలోని డొంకదారిలో ఒక పొలం గట్టున కూర్చొని సేవించారు.
విద్యార్థిని అధిక మద్యం తాగడంతో మత్తులోకి జారుకుంది. మద్యం మత్తులో కాస్త అతిగా ప్రవర్తించింది. దీంతో ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాలని ఆ యువకుడు ట్రై చేశాడు. ఫలితం లేకపోవడంతో.. తన స్నేహితుల సహాయం కోరాడు. వారు వచ్చినా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడం వీలుకాకపోయింది. ఈ క్రమంలో ఒక స్థానిక యువకుడు ఈ పరిస్థితిని గమనించి.. యువతిని వారు వేధిస్తున్నారేమో అన్న భావనతో పోలీసులకు సమాచారం అందించాడు. అతడు ఫోన్లో వీడియో తీసే ప్రయత్నం చేయగా.. అక్కడ ఉన్న వారు అతడి ఫోన్‌ను పడేశారు. పోలీసులు మహిళా హోంగార్డులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థినితో పాటు అక్కడున్న ఇద్దరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్లో కూడా మత్తులో ఉన్న విద్యార్థిని వీరంగం సృష్టించింది. సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసింది. చివరికి ఆమె వివరాలు తెలుసుకుని, తల్లితండ్రులకు సమాచారం ఇచ్చి, వారికిచ్చి పంపించారు.
Also read
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో
- జులై 12.. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. అప్పులు రాసిన మరణ శాసనం.. అయ్యో పిల్లలు..