వాళ్లంతా అమ్మాయిలు.. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఆర్కెస్ట్రా డ్యాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. కొంతమంది రాత్రి వేళ వారుండే ఇంటి వద్దకు కొచ్చి.. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయాలని కోరారు.. దానికి వారు నిరాకరించడంతో వారిని తుపాకీతో బెదిరించి అపహరించుకెళ్లారు. ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో ఇద్దరు ఆర్కెస్ట్రా డ్యాన్సర్లను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు బాధితులను బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించి.. వారుండే నివాసానికి తరలించి హేయమైన చర్యకు పాల్పడినట్లు పోలీసులు నివేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి నుంచి బాధితులను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. నిందితులు రెండు ఎస్‌యూవీలలో వచ్చి, కాల్పులు జరిపారని.. ఆ తర్వాత యువతులను కప్తంగంజ్ ప్రాంతంలోని నిందితుల్లో ఒకరైన అజిత్ సింగ్ ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఖుషీనగర్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపారు.
నాగేంద్ర యాదవ్, అశ్వన్ సింగ్, క్రిష్ తివారీ, అర్థక్ సింగ్, అజిత్ సింగ్, డాక్టర్ వివేక్ సేథ్ అనే నిందితులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అదనపు నిందితులు నిసార్ అన్సారీ, ఆదిత్య సాహ్నిలు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరి కాళ్లకు తూటాలు తగిలాయి.. దీనికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం.. నిందితుల నుంచి అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలతో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో రెండు ఎస్‌యూవీలు, నంబర్ ప్లేట్ లేని మోటార్‌సైకిల్, అక్రమ పిస్టల్, ఏడు షాట్‌గన్‌లు, నాలుగు అక్రమ పిస్టల్‌లు, పది ఖర్చు చేసిన కాట్రిడ్జ్‌లు, పన్నెండు లైవ్ రౌండ్‌లు, పదకొండు మొబైల్ ఫోన్‌లు, నేపాలీ సిమ్ కార్డ్ ఉన్నాయి.
సమచారంతో..
యువతులను కిడ్నాప్ చేస్తున్న క్రమంలో గాలిలోకి పలు రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన తరువాత, అజిత్ సింగ్ ఇంటికి వెళ్ళిన పోలీసులు నృత్యకారులను రక్షించి.. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితులు కాల్పులు జరిపారు. ప్రతీకారంగా ఇద్దరు నిందితుల కాళ్లకు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. బాధితులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. అమ్మాయిలు ఆ ఇంట్లో నలుగురు ఉంటూ.. ఆర్కెస్ట్రా డ్యాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నారని.. నిందితులు వచ్చిన సమయంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని పోలీసులు తెలిపారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..