నిషేధంలో ఉన్న చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఐదుగురిపై టీజీసీఎస్బీ పోలీసులు ఇవాళ కేసులు నమోదు చేశారు. మొహియుద్దీన్, మహ్మద్ జకీర్ అహ్మద్, భానుబేగం, ప్రసాద్‌కుమార్, భాగ్యమ్మపై వేర్వేరుగా కేసులు ఫైల్ చేశారు.
దేశ వ్యాప్తంగా పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్స్ అధిక సంఖ్యలో అందుబాటులోకి రావడంతో అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య గతం కంటే మరింత అధికంగా పెరిగిపోయింది. వీటిని నియంత్రించేందుకు నేషనల్, ఇంటర్నేషనల్ దర్యాప్తు సంస్థలు కన్నేశాయి.
పోర్న్ చూసే వారికి బిగ్ షాక్
ఇందులో భాగంగానే ముఖ్యంగా చిన్నారుల అశ్లీల వీడియోలు (చైల్డ్ పోర్న్ గ్రఫీ) చూసే వారిని టెక్నాలజీ సాయంతో పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇలా చేయడానికి పెద్దపెద్ద కారణాలే ఉన్నాయి. అలాంటి వీడియోలు చూసి.. చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గతేడాది ఆగస్టు నెలాఖరు వరకూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయి
దీనిబట్టి పరిస్థితి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో అలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఐదుగురిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు కేసులు నమోదు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (నెక్‌మెక్) ఇచ్చిన సమాచారం ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఐదుగురిలో.. హైదరాబాద్ చార్మినార్ ఈడీబజార్కు చెందిన మొహియుద్దీన్ ఒకరు కాగా, ఫలక్‌నుమా కందికల్ గేట్ ప్రాంతానికి చెందిన భానుబేగం, సికింద్రాబాద్ పార్క్లేన్కు చెందిన ప్రసాద్‌కుమార్, హబీబ్‌నగర్ మల్లేపల్లికి చెందిన మహ్మద్ జకీర్ అహ్మద్, నల్గొండ జిల్లా ఆత్మకూర్‌కు చెందిన భాగ్యమ్మపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. ఈ ఐదుగురు నిందితుల పేర్లతో ఉన్న సెల్ఫోన్ల ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలు అప్లోడ్ అయినట్లు నెక్‌మెక్ గుర్తించింది.
Also read
- వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడి
- కట్టుకోబోయేవాడే చంపాడు..
- విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
- ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస జీవితం ఇక ఖాయం!
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట





