పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడు చేసిన పనికి రెండో తరగతి విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ సరిగా చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ తీవ్రంగా కొట్టాడు. విద్యార్థి నొప్పితో తల్లడిల్లితూ ఇంటికి చేరింది. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహానికి దారి తీసింది.
తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సోఫియా అనే విద్యార్థినిని సంబంధిత టీచర్ వాతలు వచ్చేలా చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి నిలదీశారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





