తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య భర్త దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్ మేడపాడకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే, సంధ్య.. వేములపల్లికి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లి అయిన కొన్ని గంటలకే అర్ధరాత్రి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు.
తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కోపంతో సూర్య ప్రకాష్‌ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్య ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



