టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు మంచి కంటే,ఎక్కువ చెడు కోసమే వినియోగించు కుంటున్నారు. వీరు చేసే అతి తెలివి పనుల వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు కేటుగాళ్లు అధుతాన టెక్నాలజీని వాడి ఫేక్ ఏటీఎం కార్డ్స్ తయారు చేసి ఇతరుల డబ్బులను కాజేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే దుబ్బాక పట్టణంలో వెలుగు చూసింది. కంప్యూటర్ టెక్నాలజీ సహాయంతో నకిలీ ఆర్సి, ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న కంప్యూటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక పట్టణానికి చెందిన సిరిమల్లె వేణుగోపాల్ అనే వ్యక్తి స్థానికంగా బాలాజీ జిరాక్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అయితే ఈ వేణుగోపాల్ సులభంగా డబ్బులు సంపాధించేందుకు మార్గాలు అన్వేషించాడు. దీంతో తన షాప్‌కు వచ్చే కస్టమర్ల పాన్ కార్డు, బైక్ ఆర్సీ వంటి వాటి జిరాక్స్‌లు సేకరించి. వాటి సాహాయంతో నకిలీ కార్డులు తయారు చేయడం స్టార్ట్ చేశాడు.
వేణుగోపాల్ నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులను .. ఒరిజినల్ కార్డులుగా తయారు చేసి.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాడన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, దుబ్బాక పోలీసులు శనివారం అతని దుకాణంపై దాడి చేశారు. దుకాణంలో ఉన్న వివిధ నకిలీ కార్డులను, కంప్యూటర్, కలర్ ప్రింటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాల్‌ను దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుబ్బాక ఏఎస్ఐ సందాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిమల్లె వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





