సంగారెడ్డిలో మానవత్వం మంటగలిసే సంఘటప వెలుగు చూసింది. ఓ మహిళ అప్పుడే పుట్టిన పసికందును ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వదిలివేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు సకాలంలో పసికందను హాస్పిటల్కు తరలించడంతో పెను విషాదం తప్పింది. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాను రాను జనాల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. కడుపున పుట్టిన బిడ్డను కనుపాపలా కాపాడుకోవాల్సిన కన్నవారే.. కసాయిలుగా మారిపోతున్నారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో వదిలేసి వెళ్ళిపోయారు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆ మగబిడ్డ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో మానవత్వం మంటగలిసిసే ఘటన వెలుగు చూసింది. కనిపించని దేవుడు అమ్మ రూపంలో ఉంటే.. ఆ అమ్మే కసాయిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో అప్పుడే పుట్టిన మగ బిడ్డను అనాథగా వదిలేసి వెళ్లింది ఓ తల్లి. ఆసుపత్రి వెనుక భాగం నుంచి పసిబిడ్డ ఏడుపు వినపడడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు .. పొత్తిళ్లలో ఉన్న పసికందును చూసి చలించిపోయారు.. ఏడుస్తున్న బిడ్డను స్థానిక మహిళలు దగ్గరకు తీసుకుని, వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు.
స్థానికులు చూపించిన చొరవతో ఆ పసిప్రాణం నిలిచింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు శిశువుకు ప్రథమ చికిత్స అందించి, సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఆ మగబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. సమాజంలో ఎంతమంది పిల్లలు లేక అల్లాడిపోతుంటే.. పుట్టిన మగబిడ్డను ఇలా ఆసుపత్రి వెనుక వదిలి వెళ్లడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ఆ బిడ్డను వదిలేసి వెళ్ళింది కన్నతల్లేనా? లేక మరెవరైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





