SGSTV NEWS
Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డు ని బిజెపి ప్రభుత్వం నియంత్రించాలి…*

*సెన్సార్ బోర్డ్ అవినీతికి ఆలవాలంగా మారింది..*

*కన్నప్ప సినిమా సెన్సార్ జరగక ముందే విడుదల తేదీల ప్రకటన చేయటం చలన చిత్ర చట్టానికి వ్యతిరేకం….*



అమరావతి:
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డ్ (సి బి ఎఫ్ సి) ని బిజెపి ప్రభుత్వం నియంత్రించాలనీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరానికి విచ్చేసిన వైద్య విద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ లను బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరిచి, బ్రాహ్మణ ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన శిఖ ను పిలక గిలక అనే పాత్రలు సృష్టించి బ్రాహ్మణ సమాజాన్ని అవమానించి గేలి చేయడం అనేది మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిపోయిందని. గతంలో దేనికైనా రెడీ సినిమాలో  బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా మోహన్ బాబు కుటుంబం ప్రవర్తించిందని, ఇప్పుడు కొత్తగా కన్నప్ప అనే సినిమాలో సనాతన ధర్మాన్ని, దేవి దేవతల్ని అవమానించేలాగా పార్వతి అమ్మవారిని అర్ధ నగ్న ప్రదర్శన సన్నివేశాలు కన్నప్ప సినిమా అనే చరిత్ర వక్రీకరించి కల్తీ కన్నప్ప సినిమా మోహన్ బాబు నిర్మించాడని. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసి మూడు సన్నివేశాలు తొలగించమని మంచు మోహన్ బాబుని ఆదేశించిందని ఆదేశించిందని, ఇప్పుడు మల్ల అదే బ్యానర్ పై తన కొడుకు మంచు విష్ణు హీరోగా బ్రహ్మానందం పిలకపాత్రలో, సప్తగిరి గిలక పాత్రలో నటించారని గత అక్టోబర్ 9న  పిలక గిలక పోస్టర్లను మంచు విష్ణు రిలీజ్ చేశారని. ఈ సందర్భంగా బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు, దేవి దేవతల సన్నివేశాలను అర్ధ నగ్నంగా చిత్రీకరించారని, సనాతన ధర్మాన్ని మంటగలిపేలా ఈ సినిమాను చిత్రీకరించారని దీనిపైన హైకోర్టులో తాము రిట్ పిటిషన్ వేసామని, కేస్ పెండింగ్లో ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండానే తేదీ ప్రకటించారని ఇది  సి బి ఎఫ్ సి వారికి ఎలా సాధ్యపడుతుందని శ్రీధర్ ప్రశ్నించారు.




తెలుగు చలనచిత్రాలకు లంచాలు తీసుకుని రీజనల్ ఆఫీస్ సికింద్రాబాద్ కవాడిగూడ వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి వేస్తున్నారని, ఇది భారతీయ చలనచిత్ర చట్టరీత్యా నేరమని శ్రీధర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ సంస్థ పనిచేస్తుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకత్వం సనాతన ధర్మ పరిరక్షణకు విఘాతం కలిగించే కన్నప్ప సినిమాలో సన్నివేశాలు తొలగించేలా రీజనల్ ఆఫీసర్ కు ఆదేశించాలని శ్రీధర్ కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మోహన్ బాబు, బ్రహ్మానందం తదితర నటులు దేనికైనా రెడీ సినిమాలో వచ్చిన బ్రాహ్మణ ఆగ్రహం పట్ల మద్దతునిచ్చిన ఇంద్రసేనారెడ్డి లక్ష్మణ్ నేతలను తమకు కలపమని తనను ప్రాధేయపడినట్లుగా రాష్ట్ర మంత్రివర్యులు తెలిపారు. సమాజంలో అందరి మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత సినిమా వారికి ఉందని, తాము బ్రాహ్మణ సమాజానికి అండగా ఉంటామని, బిజెపి జాతీయ పార్టీలో ఈ కన్నప్ప సినిమా పైన చర్చించి తాము ఒక నిర్ణయం తీసుకుంటామని, చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి, బిజెపి రాష్ట్ర నాయకులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు, ఎండపల్లి శబరి, చిలుమూరు  ఫణి, వేదాంతం లక్ష్మణ్ తదితర అర్చక,పురోహిత బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share this