ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న వెంటనే ఓ యువకుడి బుల్లెట్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్కు గురైన యువకుడు బైక్పై నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉండటంతో బైక్ పూర్తిగా దగ్ధమై, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మీరు బుల్లెట్ బైక్ నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త. రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే కాదు.. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఖమ్మం నగరంలో ఓ యువకుడి బుల్లెట్ ఒక్కసారిగా మంటల్లో చిక్కి పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న యువకుడు బయటికి వెళ్లే సమయంలో… అతని బుల్లెట్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా షాక్కు గురైన యువకుడు బైక్పై నుంచి కిందపడిపోయి వెంటనే పక్కకు దూకాడు. దీంతో అతడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే అప్పటికే బైక్ భారీగా మంటల్లో తగలబడుతుండడంతో. బంక్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉండటంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ప్రమాదం మరింత పెరగకుండా బైక్ను బైపాస్ రోడ్డు వైపు తీసుకెళ్లి అక్కడ మంటలు ఆర్పేశారు. ఈ ఘటన ఖమ్మం వాహనదారులను తీవ్ర షాక్కు గురిచేసింది. బైక్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే యువకుడికి ప్రాణాపాయం తప్పడంతో పాటు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





