భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి తీరంలో కోళ్లు, మేక బలితో క్షుద్ర పూజలు జరిగిన ఘటన కలకలం రేపింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మకు మేకులు గుచ్చిన దృశ్యాలు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ తెలిపారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి నది ఒడ్డున ఏవో.. ఉదయాన్నే ముగ్గు లాంటి ఆకారాలు కనిపించాయి.. దీంతో గ్రామస్థులు కొందరు.. అక్కడికి వెళ్లి పరిశీలించారు. అయితే.. అక్కడి వాతావరణం చూసి ఒక్కసారిగా భయపడ్డారు.. కోళ్లు, మేక బలితోపాటు క్షుద్ర పూజలు జరగడం ఒక్కసారిగా కలకలం రేపింది. గోదావరి తీరంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించిన ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బొమ్మను పెట్టి వాటికి మేకులు గుచ్చి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేయడమే కాకుండా అతి భయంకరంగా కోళ్లను, మేకను బలిచ్చి పూజలు నిర్వహించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఉదయాన్నే గోదావరి తీరానికి వెళ్లిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చూసి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు.. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన గ్రామస్తులు బీతావాహంగా ఉన్న ఆ దృశ్యాలను చూసి భయంతో వణికిపోయారు.
ఇంత భయంకరంగా జరిగిన ఇలాంటి క్షుద్ర పూజలని ఇంతకుముందు ఎప్పుడు తాము చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు.. ఇదంతా ఎవరు చేసి ఉంటారో అర్థంకాక అంతా టెన్షన్ పడుతున్నారు. అయితే.. క్షుద్ర పూజల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామమని నెల్లిపాక సర్పంచ్ చెప్పారు. కాగా..ఈ క్షుద్రపూజల గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలియడంతో.. ఆయా గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





