తన భార్య, బావమరిది తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడో రైల్వే ఉద్యోగి.
.
వారణాసి: తన భార్య, బావమరిది తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడో రైల్వే ఉద్యోగి. ఇటీవల మేరర్లో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన తరహాలో చంపుతామని బెదిరిస్తున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన భార్య తన ఉద్యోగం కోసం ఆరాటపడుతోందని, దాని కోసం తనను చంపాలని చూస్తున్నట్లు ఆరోపించాడు. ఇందులో భాగంగా వారిద్దరూ తనపై భౌతికదాడికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్న బిహార్లోని గయాకు చెందిన సుమిత్ కుమార్ శనివారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తన భార్య, ఆమె సోదరుడు తనను మేరఠ్ హత్య ఘటన తరహాలో చంపాలని మాట్లాడుకుంటుండగా తాను విన్నట్లు సుమీత్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులు చిత్తుపుర్లో ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన యూ పి లోని మేరర్ లో Merchant Navy officer Murder) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌరభ్ రాజ్పుత్ అనే వ్యక్తిని అతడి భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపింది. ఇప్పుడు ఆ ఇద్దరూ జైలులో ఉన్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





