ఆంధ్రప్రదేశ్, బాపట్ల: ఆన్లైన్ లో ఏర్పడిన పరిచయం వేధింపులు ఆపై దాడికి దారితీసిన ఘటన బుధవారం సాయంత్రం చీరాల మండలం జాండ్రపేట సమీపంలోని అక్కయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజమండ్రికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బలుకూరి సత్యవాణి (32) టైలర్గా పని చేస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించగా అనంతరం సోషల్ మీడియా ద్వారా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన జోగాబత్తుని వెంకట కిరణ్ పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిందితుడు ఆమె బంధువులకు పంపడంతో బాధితురాలు అతనిపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు నమోదు చేసింది.
వన్లైన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..
కొంతకాలం అనంతరం మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తనతో కలిసి ఉండాలని, లేకపోతే ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రవర్తన గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాధితురాలు మంగళవారం చీరాల వచ్చారు.
సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అక్కయపాలెం రోడ్డులో వెళుతుండగా వెంకట కిరణ్ అతని స్నేహితులతో కలిసి ఆమెను అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని తెలిపింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా చీరాలకు తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమె బుధవారం చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





