గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళను టార్గెట్‌గా చేసుకున్న ఓ జంట.. సమయం చూసి అమె ఇంట్లోకి దూరారు. అనంతరం అమెపై దాడి చేసి.. అమె మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని ఆమె గదిలో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాగో వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఒంటరిగా ఉన్న మహిళే టార్గెట్‌గా ఇంట్లోకి చొరబడిన ఓ జంట ఆమెను చితకబాది.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన తెలినాలిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీరావు నగర్లో లక్ష్మీ అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం సాయంత్రం వేళ ఓ యువకుడు వచ్చి లక్ష్మి ఇంటి తలుపు కొట్టాడు. ఆమె తలుపు తీయగానే, అతడితో పాటు వచ్చిన మరో యువతి ఆమెను నెట్టుకుంటూ లోపలికి వెళ్లింది. ఆమె వెంటే ఆ యువకుడు సైతం లోపలికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మిని బంధించి, చీరతో ఆమె చేతులు కట్టేసి, నోట్లో కర్చీఫ్ కుక్కారు. అనంతరం ఆమె మెడలోని బంగారు చైన్‌ను తెంపుకున్నారు. ఆ తర్వాత ఇంటి తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలంటూ ఆమెపై విపరీతంగా దాడి చేసి కొట్టారు. ఆమె చెప్పకపోవడంతో, బాధితురాలు తాగేందుకు మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా పక్క గదిలోకి నెట్టేసి ఇంటి తాళాల కోసం వెతకడం ప్రారంభించారు.
అయితే దుండగులు ఆమెను తోసేసిన గదికి బయటకు వెళ్లేందుకు మరో తలుపు ఉందన్న విషయాన్ని వారు గమనించలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న లక్ష్మి, ఆ తలుపు తీసుకొని వెంటనే రోడ్డుపైకి వచ్చి పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి బయటకు వెళ్లి కేకలు వేయడం గమనించిన యువతీ యువకులు వెంటనే గోడదూకి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
చందా కోసం వచ్చిన వ్యక్తే నిందితుడు!
అయితే దాడికి పాల్పడిన యువకుడు గతంలో వినాయక చవితి చందా కోసం తన ఇంటికి వచ్చిన వ్యక్తేనని బాధితురాలు ఆరోపిస్తోంది. వారం రోజుల క్రితం కూడా అతడు ఇంటికి వచ్చి తలుపు కొట్టి వెళ్లాడని, ఎవరని అడిగేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడని లక్ష్మి వివరించింది. దాడి సమయంలో నిందితులు ఆమెను కొట్టడమే కాకుండా, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. లక్ష్మి కొడుకు చీరాలలో ఉంటున్నాడన్న విషయాన్ని కూడా దుండగులు ప్రస్తావించడంతో, ఆమె గురించి తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరారీలో ఉన్న యువతీ యువకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మంచి రోజులు ప్రారంభం.. గురు సంచారంతో వీరికి పట్టింది బంగారమే
- అంతా శివలీల..! ఆలయంలోకి మూడు నాగు పాములు వచ్చి ఏం చేశాయంటే..?వైరల్ వీడియో
- అద్భుత శక్తులు వస్తాయని.. చంపి శరీర భాగాలను తీసుకెళ్తాడు.. ఆ తర్వాత..
- గతంలో గణేష్ చందా కోసమని ఇంటికొచ్చిన యువకుడు.. సరిగ్గా నెల రోజుల తర్వాత





