సాయి ప్రకాశ్ హత్య కేసులో కానిస్టేబుల్తో సహా ఆరుగురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీపీ సన్ ప్రిత్ సింగ్
వరంగల్ : తన వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్ ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్ తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు
ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాపురం(కె) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేశారు.
ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్య
ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాసు ఫోన్ లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్పూర్లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశు కారులోనే కిడ్నాప్ చేసి హసన్పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు.
నిందితుల అరెస్ట్..
ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్ తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరున్ మార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్ కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
అధికారులకు అభినందనలు..
సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్టజోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ
సన్ ప్రిత్ సింగ్ అభినందించారు.
Also read
- ఓల్డ్‌సిటీలో ఆటో డ్రైవర్ పిచ్చి వేషాలు.. టూరిస్టులను, మహిళలను చూస్తూ.! ఛీ.. ఇదేం పనిరా…
- Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చి.. ఆపై.!
- ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో..
- Nellore: పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇదేం పని.. పొలీసులకు అనుకోకుండా చిక్కిన భార్యభర్తలు
- ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు!.. మనస్థాపంతో విద్యార్థిని..





