ధర్మవరం. అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరానికి చెందిన ఎం కోటిరెడ్డి (47) స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఇంట్లో నిద్రిస్తుండగా వేకువజామున వైద్యం కోసం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు తెలుపు తట్టారు. తలుపు తీసిన ఆర్ఎంపీ వైద్యుడిపై మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. కుప్పకూలిన కోటిరెడ్డి సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఈ దృశ్యాలను చూసిన భార్య స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దర్శి డీఎస్పీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు





