అమరావతి:
పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుంచే నాటుతూ వాతావరణం లో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోటా కార్తీక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు సైకిల్ పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు. సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ భూమిని కాపాడుకుందాం – చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్య రహిత భారతదేశం నిర్మాణం జరగాలని ఆయన కాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెదేపా నేత, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ని కలిశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక, చాణిక్య ఫ్రెండ్ సర్కిల్ వారు సైకిల్ యాత్రకు సంఘీభావం తెలియజేశారు. అతనికి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయన్ను గుంటూరు నుంచి సిరిపురపు శ్రీధర్ జెండా ఊపి అతని యాత్రను తిరిగి ప్రారంభం చేశారు. సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నేటి యువతకు కార్తీక్ స్ఫూర్తిగా నిలవాలని చిన్న వయసులోనే భూమిని కాపాడటం చెట్లను నాటాలి కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశం యువకుల్లా రావడం అభినందన్చ దగ్గ విషయమని, నేటి యువకులు చదువులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు భూమ్మీద సామాజిక సమతుల్యత ఎలా చేయాలి అనేది కూడా గ్రహించాలని , ఈ యువకునికి సోషల్ మీడియాలో దాదాపు రెండు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారని, ఈ యువకుడు కడప నుంచి కాశ్మీర్ వరకు జరిపే ప్రయాణం దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో ఈ యువకుడికి సంఘీభావం తెలియజేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుమూరు ఫణి, ఎండపల్లి శబరి, ఫణి, నాగరాజు, వడ్లమూడి రాజా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Also read
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!