SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: భార్యతో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాడు – కట్ చేస్తే




అంబర్‌పేట్‌లో దంపతులు తమ ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్న విషయం బయటపడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసిన భర్త.. ఆర్థిక సమస్యలతో ఈ పనికి దిగాడని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పిల్లలకు ఈ వ్యవహారం తెలియదని తెలిపారు.


హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఇద్దరు దంపతులు వెర్రి చేష్టలకు పాల్పడ్డారు. తమ ఇంటి టెర్రస్‌ను అడ్డాగా చేసుకొని తమ ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దంపతులు ఉంటున్న ఇంటిని రైడ్ చేశారు. వీడియోలు చిత్రీకరిస్తున్న కెమెరాతో పాటు సామాగ్రిని స్వాధీనం చేసుకుని అంబర్‌పేట పోలీసులకు ఇద్దరినీ అప్పగించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను గతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసేవాడు. ఇప్పుడు అందులో పెద్దగా డబ్బులు రాకపోవడంతో ఈ పాడు వ్యవహారానికి తెరలేపాడు. నాలుగు నెలల నుంచి  తన భార్య తో గడుపుతున్న ప్రైవేట్ వీడియోలను కెమెరాలో చిత్రీకరించి వాటిని ఆన్లైన్లో వీక్షించే వినియోగదారులకు పేమెంట్ చెల్లిస్తేనే చూసే విధంగా వ్యాపారం మొదలుటపెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో లైవ్ స్ట్రీమింగ్‌ని సైతం ఏర్పాటు చేశారు. తమ వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చూడాలి అనుకునేవారు 2000 రూపాయలు చెల్లించాల్సిందిగా నిబంధన పెట్టి నాలుగు నెలలుగా ప్రతిరోజు ఈ తరహా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.

అయితే ఇది సాధారణ వీక్షకులు చూసేందుకు వీలు లేకుండా కేవలం ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారు మాత్రమే ఈ వీడియోలను చూసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొడుకు బీటెక్ చదువుతుండగా.. కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. అయితే తమ తల్లిదండ్రులు చేస్తున్న ఈ బాగోతం పిల్లలకు తెలియదు అని పోలీసులు చెబుతున్నారు. వీరు చేస్తున్న వీడియోల బాగోతం స్థానిక వ్యక్తుల ద్వారా టాస్క్ ఫోర్స్ వారికి తెలియడంతో… రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.


Also read

Related posts

Share this