Lucky Zodiac Signs May 2026: వైశాఖ పౌర్ణమి రోజైన మే 1న చంద్రుడు రాహువుకు ప్రియమైన స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ అరుదైన నక్షత్ర పరివర్తన వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభం కలగడమే కాకుండా, పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా నాలుగు రాశుల జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక రకాలుగా మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి అశుభ ఫలితాలు, ఒక్కోసారి శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.
చంద్రుడు వైశాఖ పౌర్ణమి నాడు రాహు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. చంద్ర సంచారంలో మార్పు ఈ రాశుల వారికి వైశాఖ పౌర్ణమి నుంచి అనేక లాభాలను అందిస్తుంది. వైశాఖ పౌర్ణమి మే 1, శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఉదయం 2:16కి చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. మే 2 తారీకు వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. మరి ఈ సమయంలో ఏ రాశుల వారు లాభాలను పొందుతారు? ఎవరికి ఎలా కలిసి రాబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
వైశాఖ పౌర్ణమి నాడు చంద్ర సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు
1.మిధున రాశి:
మిధున రాశి వారికి వైశాఖ పౌర్ణమి వేళ చంద్ర సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు. బిజినెస్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆనందం కూడా రెట్టింపు అవుతుంది
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. పాత ప్రాజెక్టులు అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతాయి. ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రయోజనాలు పొందుతారు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఈ రాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా శుభప్రదమైన ఫలితాలు అందబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం కూడా దృఢంగా మారుతుంది.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా చంద్ర సంచారంలో మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. రాహు నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. విదేశీ ప్రయాణంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి.
