మూడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై ఓ మహిళ మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన బాధిత మహిళ డిమాండ్ చేసింది.
బందరు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్‌తో 2020లో తనకు వివాహం జరిగిందని ఆమె చెబుతోంది. అయితే పెళ్లి అయిన రోజు నుండి తనను చిత్ర హింసలకు గురి చేశాడని వాపోతుంది. ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపింది. తనతో పెళ్లి కాక ముందు కూడా వేరే మహిళతో రామ్ చరణ్ కు వివాహం అయినట్టు ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ పోలీసులను కోరుతోంది
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!