అదో పట్టణ ప్రాంతం.. ఎప్పుడూ హాడావుడిగా ఉంటుంది.. ఈ క్రమంలోనే ఓ ఇంటిముందు వెరైటీ ముగ్గు ప్రత్యక్షమైంది. దీన్ని చూసి కొందరు ఇదేదో తేడాగా ఉందని దగ్గరికెళ్ళారు.. అది చూసి వారికి గుండె ఆగినంత పనైంది.. అది ముగ్గు కాదని అర్ధమైంది.. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుంతకల్లులోని రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు ముగ్గు వేసి.. పసుపుకుంకుమ, నిమ్మకాయలతో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియనివ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.
అయితే.. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై పోరాటం చేస్తున్నందుకే తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసి.. కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని రామచంద్రప్ప ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడనని.. క్షుద్ర పూజల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రామచంద్రప్ప పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాలు చేసి కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన కొందరిపై తాను పోరాడుతున్నానని.. అందుకే తనపై ఇలా కక్ష గట్టి క్షుద్ర పూజలు చేశారని రామచంద్రప్ప ఆరోపించారు
Also read
- అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం.. ఊహించని ప్రమాదంతో..
- Viral: అక్కా.! నీకో దండం.. భర్తను అమ్మేసిన భార్య.. కారణం తెలిస్తే బిత్తరపోతారు
- ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం
- తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి
- అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..





