8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.. పది నెలల బాబు కూడా ఉన్నాడు.. మధ్యలో వచ్చిన అబ్బాయి మేనమామ ఇద్దరినీ విడగొట్టాడు.. ఇప్పుడు నాకు నా భర్త కావాలి అంటూ ఆ అభాగ్యురాలు అత్త ఇంటి ముందు.. పది నెలల బాబుతో న్యాయ పోరాటం చేస్తుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది.
వీడియో చూడండి..
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం.. బత్తిన వాండ్లపల్లి గ్రామానికి చెందిన మడితాటి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.. అలాగే రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చాగల గుట్టపల్లికు చెందిన సౌజన్య అనే యువతీ గత రెండేళ్ల క్రితం హైదరాబాదులోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటున్నారు. సౌజన్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, మహేశ్వర్ రెడ్డి జస్ట్ డయల్ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికీ 10 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే గత నాలుగు ఐదు నెలల క్రితం మహేశ్వర్ రెడ్డి మేనమామ హైదరాబాద్ వచ్చి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టినట్లు బాధితురాలు సౌజన్య వాపోతోంది.. మహేశ్వర్ రెడ్డి మేనమామ వచ్చిన దగ్గరనుంచి వేరే విధంగా బిహేవ్ చేస్తున్నాడని, కావాలని వరకట్నం వేధింపులకు గురి చేస్తున్నాడని అంతేకాకుండా తక్కువ జాతి అమ్మాయిని చేసుకున్నావు అని మహేశ్వర్ రెడ్డికి ఆయన మేనమామ మనసు విరిగేలాగా చేశాడని బాధితురాలు వాపోతుంది. దీంతో రెండు నెలల క్రితం మహేశ్వర్ రెడ్డి హైదరాబాదు నుంచి తన సొంత గ్రామానికి వచ్చేసాడని తర్వాత తన వద్దకు రాలేదని సౌజన్య తెలిపింది.
గత రెండు నెలల క్రితం అన్నమయ్య జిల్లా పోలీసులకు ఈ విషయం చెప్పడంతో వారు కౌన్సిలింగ్ కు పంపించారని గత రెండు నెలలుగా నాలుగు కౌన్సిలింగ్ లు జరిగినా తన భర్తలో ఎటువంటి మార్పు రాలేదని, ఆయన వారి తల్లిదండ్రులు, మేనమామ మాటలే వింటున్నాడని తనకు న్యాయం జరగలేదని సౌజన్య వాపోయింది.. ఇంత జరిగినా న్యాయం జరగకపోవడంతో భర్త ఇంటి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది సౌజన్య.. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని వివాహిత సౌజన్య అంటోంది. ఇంటి ముందు వచ్చి నిరసన చేస్తున్నామని తెలిసి మహేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది.
వివాహం చేసుకొని బిడ్డను కూడా కని ఇలా భార్యను వదిలేయటం ఈ మధ్యకాలంలో కొందరు యువకులకు అలవాటుగా మారిందని దీనిపై అధికారులు మరింత దృష్టి పెట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఇలాంటి సంఘటనలు రోజు తెరపైకి వస్తూనే ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు
Also read
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు.. ఇంతలో
- జులై 12.. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. అప్పులు రాసిన మరణ శాసనం.. అయ్యో పిల్లలు..