విశాఖ ఆర్డీవో, డీఆర్వో వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆర్డీవో, డీఆర్వోలను రిలీవ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఇంతకీ వీరిద్దరిపై ప్రభుత్వం ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుందో తెలుసుకుందాం పదండి…
విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్‌ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వో మధ్య ఉన్న విభేదాలు తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. ఎమ్మార్వో కార్యాలయాల నుంచి డీఆర్వో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీవో శ్రీలేఖ నాలుగు రోజుల క్రితం విశాఖ కలెక్టర్‌కు లేఖ రాశారు. ప్రోటోకాల్ పేరుతో నెలనెలా నిత్యావసర సరుకులు పంపాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని.. శ్రీకాకుళంలోని DRO కుటుంబానికి కూడా కిరాణా సామాగ్రిని పంపాలని ఉద్యోగులను వేధిస్తున్నారని ఆర్డీవో శ్రీలేఖ ఆరోపించారు. కలెక్టర్‌కు ఆర్డీవో రాసిన లెటర్ వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. RDO తీరుపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. పెందుర్తి మండలంలో ఓ విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో ఆర్డీవోకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఆయా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా RDO, DROలను ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆర్డీవో, డీఆర్వోలను జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక.. హెచ్‌బీసీఎల్ డిప్యూటీ కలెక్టర్ విద్యాసాగర్‌కు విశాఖ ఆర్డీవోగా.. డీఆర్వో బాధ్యతలను విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర అశోక్‌లకు అప్పగించింది. ఆర్డీవో, డీఆర్వోలను వెంటనే రిలీవ్ చేయాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించింది కూటమి ప్రభుత్వం.
Also read
- బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!
- నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది





