పంజాబ్ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్ ముస్తాఫా తనయుడు అకీల్ అక్తర్(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్ 16వ తేదీన అకీల్ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షాముద్దీన్ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో..
తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్కు పంపారని, తన వ్యాప్నా చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.
తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని.. హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ) పైనా బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





