SGSTV NEWS
Andhra PradeshCrime

ఆమ్లెట్ మాడిందని భార్యతో గొడవపడ్డ భర్త.. ఆ తర్వాత జరిగిందిదే..



కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఓ చిన్న ఆమ్లెట్.. అవును మీరు చదివింది కరక్టే.. ఆమ్లెట్ మాడిందని భర్త.. భార్యను మందలించాడు.. ఆ తర్వాత ఘోరం జరిగింది. మాడిపోయిన ఆమ్లెట్ గొడవ.. తర్వాత భార్య పుట్టింటికి వెళ్లింది.. ఆ తర్వాత ఆమె రాకపోవడంతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఈ దారుణ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.


విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మిర్తివలసలో విషాదం చోటుచేసుకుంది. సాలూరు పట్టణానికి చెందిన పాలవలస శేఖర్ అనే యువకుడు భార్యతో జరిగిన చిన్నపాటి గొడవకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. శేఖర్‌ కు నాలుగేళ్ల క్రితం ఆదిలక్ష్మితో అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ జీవనోపాధిగా వెదురు బుట్టలు, కంచాలు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆదివారం సాయంత్రం వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చిన శేఖర్ భోజనం పెట్టమని భార్య ఆదిలక్ష్మిని అడిగాడు. దీంతో ఆదిలక్ష్మి భోజనంతోపాటు ఆమ్లెట్ వేసి ఇచ్చింది. అయితే ఆ ఆమ్లెట్ కొంచెం మాడిపోవడంతో శేఖర్ ఆగ్రహానికి లోనై భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ గొడవపడ్డారు.


ఈ గొడవతో ఆదిలక్ష్మి అలిగి తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లిన విషయాన్ని తట్టుకోలేకపోయిన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు శేఖర్. అలిగి వెళ్ళిన ఆదిలక్ష్మి సోమవారం తిరిగి వస్తుందని భావించాడు. అయినా రాకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో సాలూరు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్తివలస గ్రామానికి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి తన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాడు.

వెంటనే స్పందించిన స్నేహితులు శేఖర్‌ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి ఆమ్లెట్ వివాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన అందరినీ కలచివేస్తుంది.

వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం – శ్రావణ శుక్రవారం పూజ

Also read

Related posts

Share this