ఆటోలో నుంచి నలుగురు యువకులు దిగి ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ వద్దకు వచ్చారు. బస్సు దిగాలంటూ వాదనకు దిగారు.. చేసేదేమీ లేక డ్రైవర్ బస్సు దిగాడు. వెంటనే నలుగురు యువకులు బస్సు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేయడం మొదలు పెట్టారు. వెంటనే బస్సు కండక్టర్ మరికొంత మంది ప్రయాణీకులు దాడిని నిలవరించే ప్రయత్నం చేశారు.
అది మాచర్ల శ్రీశైలం రోడ్డు.. శ్రీశైలం నుంచి బయలు దేరిన ఆర్టిసి బస్సుు మరి కొద్దిసేపట్లో మాచర్ల డిపోకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే.. ఒక ఆటో ఆర్టీసీ బస్సు వెనుకనే వస్తుంది. రెండు, మూడు సార్లు.. ఆటో బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్.. సాధ్యం కాకపోవడంతో బస్సు వెనుకే ఆటోను రానిస్తున్నాడు.. ఇంతలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద స్టాప్ ఉండటంతో.. డ్రైవర్ బస్సును అక్కడ నిలిపాడు. బస్సులో నుంచి ప్రయాణీకులు కిందకి దిగుతున్నారు. అదే సమయంలో బస్సు వెనుక వస్తున్న ఆటోను బస్సు ముందు నిలిపారు యువకులు..
ఆటోలో నుంచి నలుగురు యువకులు దిగి ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ వద్దకు వచ్చారు. బస్సు దిగాలంటూ వాదనకు దిగారు.. చేసేదేమీ లేక డ్రైవర్ బస్సు దిగాడు. వెంటనే నలుగురు యువకులు బస్సు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేయడం మొదలు పెట్టారు. వెంటనే బస్సు కండక్టర్ మరికొంత మంది ప్రయాణీకులు దాడిని నిలవరించే ప్రయత్నం చేశారు. అసలేం జరిగిందంటూ యువకులను ప్రశ్నించారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న యువకులు ఆటో కు సైడ్ ఇవ్వలేదని అందుకే దాడి చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బిత్తరపోయిన ప్రయాణీకులు, కండక్టర్ యువకులను గట్టిగా నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బస్సు డ్రైవర్ పై దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు.
వీడియో..
మరికొంత మంది ప్రయాణీలకు కూడా బస్సు దిగి ఆ యువకులను పట్టుకున్నారు. అయితే ముగ్గురు మాత్రం చిక్కగా మరొకడు పరిస్థితిని గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. వీరంతా మాచర్లలోని ఎర్రగడ్డ కాలనీ చెందిన వారిగా గుర్తించారు. పవన్, సుతార్, మల్లికార్జున్, శరత్ చంద్రలు మండాది నుంచి వస్తూ మార్గ మద్యలో మద్యం సేవించి ఆర్టిసి బస్సు డ్రైవర్ ఆటోకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా దాడి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అయితే వీరిలో ముగ్గురే పోలీసుల అదుపులో ఉండగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి దాడిలో డ్రైవర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మద్యం మత్తులో దాడికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు, ప్రయాణీకులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు