పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు శారీరకంగా వాడుకోవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ప్రతిసారి అబార్షన్ చేయిస్తూ తిరిగి అనుభవించి మోజు తీరడంతో మొకం చాటేశాడు.
TG Crime: ప్రేమపేరుతో(Love Affair) పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు శారీరకంగా వాడుకోవడంతో ఆ యువతి గర్భం(Pregnency) దాల్చింది. గర్భం దాల్చిన ప్రతిసారి అబార్షన్(Abortion) చేయిస్తూ తిరిగి శారీరకంగా అనుభవించిన ఆ యువకుడు మోజు తీరడంతో మొకం చాటేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
అనేక సార్లు అబార్షన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది యువతి. 2023లో అదే సంస్థలో పసుపులేటి అచ్యుత్ అనే యువకుడు ఉద్యోగంలో చేరాడు.ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా యువతితో పరిచయం పెంచుకున్నాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. అలా ఇద్దరూ కలసి సహజీవనం చేయడం ప్రారంభించారు. అలా తొలిసారి 2023 సెప్టెంబర్ లో యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అచ్యుత్‌కు చెప్పడంతో అబార్షన్ కావడానికి మందులు తెచ్చి ఇచ్చాడు. దాంతో ఆమెకు అబార్షన్ అయింది. అలా అనేక సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. అలా చేయడం వల్ల ఆ యువతి అనారోగ్యానికి గురైంది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఎక్కువ సార్లు అబార్షన్ చేయించడంతో అనారోగ్యం భారిన పడిన యువతి అందం తగ్గిందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు అచ్యుత్ తల్లితో పాటు, వారి కుటుంబ సభ్యులకు, వారిద్దరికీ కామన్ స్నేహితులైన కావ్వ, ఆదిత్యకు కూడా చెప్పింది, కానీ వారెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 20న ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీఎన్‌ఎస్ 69,79,89, 351(3) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న