SGSTV NEWS
CrimeOperationSindoor

జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం


జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టుల ఎదురుకాల్పుల సమయంలో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి అనే కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్య చికిత్స అందిస్తుండగా మరణించాడు.

ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు దట్టమైన ఫారిస్ట్‌లో జాయింట్ ఆపరేషన్ జరిపారు. అందులో భాగంగానే ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చారు. జవాన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక జవాన్ మరణించాడని వైట్ నైట్ కార్ప్స్ Xలో పోస్ట్ చేసింది.

Also read

Related posts

Share this