SGSTV NEWS online
Astrology

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!



వార ఫలాలు (మే 10-16, 2026): మేష రాశి వారు ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా వారమంతా బాగానే సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు సరైన నిర్ణయాలతో ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా బాగానే గడిచిపోతుంది. శుభ గ్రహాల సంచారం బాగున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి.  కొద్దిగా సామరస్యంతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శుక్రుల బలంతో పాటు శని బలం కూడా పెరిగినందువల్ల ఆర్థికపరంగా వారమంతా బాగానే సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇతరులకు సహా యం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు,  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కుటుంబంలో వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. సరైన నిర్ణయాలతో ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వారమంతా ఆర్థికంగా బాగానే సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల మానసిక విశ్రాంతి కరువవుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. లాభ స్థానం బలంగా ఉన్నందు వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వారంలో ఎక్కువ భాగం అనుకూలంగానే సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా పురోగమిస్తుంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకువెడతారు. ఉద్యోగంలో పని భారం పెరిగినా మంచి ఫలితాలుంటాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి  బయట పడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వారం చివర్లో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఒకటి రెండు చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ మొత్తం మీద వారమంతా ప్రశాంతంగా, సంతృప్తి కరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం శ్రేయస్కరం కాదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వారమంతా ఆశించిన విధంగానే సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభ వార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుభ గ్రహాల అనుకూలత కారణంగా వారమంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా, నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఊహించని పురోగతి ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.



కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురువు శుభ దృష్టి ఉన్న కారణంగా వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలను కూడా తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వారమంతా సమస్యలు లేకుండా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత, సామరస్యం ఏర్పడతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

Also read

Related posts