పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.
చంద్రగిరి : పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణిగుంట మండలం ఆర్. మల్లవరం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్(31) దుర్మరణం చెందాడు. యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుటుంబ సభ్యుల కోరిక అక్కడ మానేసి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపులున్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





