ఒంగోలు : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన సాదు శ్యామ్ అలియాస్ శ్యాంసుందరరావు (49) 2020 జూన్ 8న ఓ బాలిక(10) ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడి చేశాడు.
బాలిక తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్ వేశారు. నేర నిరూపణ కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను జడ్జి విధించారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ.2,50,000 ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందజేయాలని ఆదేశించారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





